Sunil Chhetri – Messi : ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా ముంబై మహా నగరంలో లియోనల్ మెస్సీ(Lionel Messi) అడుగుపెట్టాడు. విమానాశ్రయంలో ఘన స్వాగతం తర్వాత అభిమానులను అలరించేందుకు వాంఖడే మైదానం చేరుకున్నాడు. ఈ సందర్భంగా భారత ఫుట్‌బాల్ గోట్ సునీల్ ఛెత్రీ (Sunil Chhetri).. వరల్డ్ స్టార్ మెస్సీని కలిశాడు. ఇద్దరూ సాకర్ దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఈలలు, కేకలతో వాంఖడేను హోరెత్తించారు. ఛెత్రికి సంతకం చేసిన తన పదో నంబర్ జెర్సీని కానుకగా ఇచ్చాడు మెస్సీ.
భారత పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న మెస్సీ బృందం ఆదివారం ముంబైలో వాలిపోయింది. శనివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగించిన మెస్సీ ఈసారి వాంఖడేలోనూ తన మేనియా చూపించాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లిన అర్జెంటీనా స్టార్.. భారత ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రీని కలిశాడు. పరస్పరం అభినందించుకున్న తర్వాత తన సంతకంతో కూడిన జెర్సీని ఛెత్రీకి బహూకరించాడు మెస్సీ. అనంతరం సూరెజ్, డిపౌవ్లతో కలిసి ఇద్దరూ ఫొటో దిగారు.
Sunil Chetri openly called Messi the GOAT, mentioned Messi as his favourite on multiple platforms still you expected him to skip meeting Messi and built fake narratives around it 🤡
that’s why Karma will never help you ever…
Realize and start having or die stupid. pic.twitter.com/ZHJzEKQbH4— Dupe 🇦🇷 (@Ghajinii_) December 14, 2025
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం మెస్సీని కలిసి మురిసిపోయాడు. తన పదో నంబర్ టీమిండియా జెర్సీని మెస్సీకి కానుకుగా అందించాడు సచిన్. సాకర్ మాంత్రికుడి జెర్సీ నంబర్ కూడా 10 కావడం విశేషం. జెర్సీ బహూకరణ సమయంలో మెస్సీతో ముచ్చటించిన మాస్టర్ బ్లాస్టర్.. మెస్సీ బృందంతో కలిసి ఫొటోలకు ఫొజిచ్చాడు. అయితే.. మెస్సీని కలిసేందుకు లండన్ నుంచి విరాట్ కోహ్లీ(Virat Kohli) భారత్‌కు విచ్చేశాడని కథనాలు వచ్చాయి. కానీ, విరాట్ వాంఖడేకు రాకపోవడంతో అవన్నీ కల్పితాలే అని ఉసూరుమన్నారు అభిమానులు.
The greatest cricketer of all time, Sachin Tendulkar, with the greatest footballer of all time, Lionel Messi. 🐐 x 🐐 pic.twitter.com/R9swKbC0uO
— Inter Miami News Hub (@Intermiamicfhub) December 14, 2025
భారత్ గర్వించదగ్గ ఫుట్‌బాలర్ అయిన సునీల్ ఛెత్రి నిరుడు జూన్‌లో వీడ్కోలు పలికాడు. కానీ, ఆ తర్వాత బ్లూ టైగర్స్ పరాజయాలను చూడలేక ఏఎఫ్సీ ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్ కోసం నవంబర్‌లో యూటర్న్ తీసుకున్నాడు. అయితే.. టీమిండియా ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించకపోవడంతో తన 20 ఏళ్ల కెరీర్లో ముగిసిందని ఛెత్రీ తెలిపాడు. ఈ స్టార్ ఆటగాడు నీలి జెర్సీతో 145 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కెరీర్ మొత్తంగా 93 గోల్స్ సాధించాడీ వెటరన్ ప్లేయర్.
Sunil Chetri Is The Real Goat, But Wearing The T-shirt Of Another International Player Isn’t Look Good. Will Messi Or Ronaldo Wear Our Indian Jersey If He Visited Their Country,Nope!! Why We?? #MessiInIndia https://t.co/YCsIaFp3xJ
— Sigma (@Sigma5578) December 14, 2025