Hardik Pandya : పునరాగమనంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వరుసగా రికార్డులు నెలకొల్పాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న పాండ్యా.. మొన్న టీ20ల్లో సిక్సర్ల సెంచరీ కొట్టేశాడు. కటక్‌లోని బారబతి స్టేడియంలో నాలుగు సిక్సర్లు బాదిన పాండ్యా.. వంద సిక్సర్ల క్లబ్లో చేరాడు. మూడో టీ20లో బంతితోనూ రాణించిన పాండ్యా వందో వికెట్ తీశాడు. ట్రిస్టన్ స్టబ్స్(Tristan Stubbs)ను ఔట్ చేయడం ద్వారా పొట్టి క్రికెట్లో వికెట్ల సెంచరీ సాధించాడీ ఆల్‌రౌండర్.
అంతర్జాతీయంగా పొట్టి ఫార్మాట్లో ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకడైన హార్దిక్ పాండ్యా తన పేరిట రికార్డలు రాసుకుంటున్నాడు. మూడు నెలల బ్రేక్ తర్వాత టీమిండియా జెర్సీ వేసుకున్న అతడు.. దక్షిణాఫ్రికాపై చెలరేగినపోతున్నాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న మూడో టీ20లో స్టబ్స్ వికెట్ తీయడంతో.. వంద వికెట్లు తీసిన మూడో బౌలర్ అయ్యాడు పాండ్యా. అతడి కంటే ముందు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh), జసప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లు ఈ ఘనత సాధించారు. సఫారీలపై తొలి టీ20లో డెవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేసి జస్ప్రీత్ బుమ్రా వంద వికెట్ల వీరుడిగా అవతరించాడు.
Milestone moment. 🙌#HardikPandya gets #TristanStubbs and becomes just the third Indian to reach 100 T20I wickets! 💥🔥
A clever seam-up ball outside off, a faint edge, and #Jitesh does the rest.#INDvSA 3rd T20I | LIVE NOW 👉 https://t.co/TBYQYBG4F9 pic.twitter.com/OwUION7JE2— Star Sports (@StarSportsIndia) December 14, 2025
💯 and COUNTING 👌
Congratulations to Hardik Pandya on completing 1⃣0⃣0⃣ T20I wickets 👏👏
Updates ▶️ https://t.co/AJZYgMAHc0#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/i1c0GdYUiy
— BCCI (@BCCI) December 14, 2025
భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు రోహిత్ శర్మ (Rohit Sharma) పేరిట ఉంది. మంచినీళ్లు తాగినంత సులభంగా బంతిని స్టాండ్స్‌లోకి పంపే హిట్‌మ్యాన్ 205 సిక్సర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా సారథిగా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్ 155తో రోహిత్‌కు దరిదాపుల్లో ఉన్నాడు.
సిక్సర్ల సెంచరీ జాబితాలో విరాట్ కోహ్లీ 124 సిక్సర్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. పాండ్యా నాలుగో ప్లేస్ సాధించాడు. కేఎల్ రాహుల్ 99 సిక్సర్లతో ఐదో స్థానంలో నిలిచాడు. నిరుడు టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు రోహిత్, విరాట్ వీడ్కోలు పలికారు. దాంతో.. పాండ్యా మరో 25 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపితే కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది.