సిటీబ్యూరో, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): మూసీ ఆధునీకరణ పేరిట ప్రజాధనం విదేశాల్లో ఖర్చు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 19న దక్షిణ కొరియాకు హైదరాబాద్ నుంచి 50 మందికి పైగా ఉన్న బృందాన్ని తరలించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. ఈ బృందంలో మూసీ పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజా, పర్యావరణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు, పలు శాఖలకు చెందిన అధికారులు ఇం దులో ఉన్నారు. ఇప్పటికే దక్షిణ కొరియాకు వెళ్లే బృందంలోని ప్రతినిధులకు వీసాలు కూడా ఖరారు కాగా.., అక్టోబర్ 19న జట్టుగా హైదరాబాద్ నుంచి బయలు దేరనున్నారు. అయితే, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ, క్షేత్ర స్థాయిలో ఇందుకు విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా పర్యటనకు కసరత్తు చేశారని సమాచారం. ఆరు రోజుల పర్యటన కోసం ఎంఆర్డీసీఎల్ ఈ పర్యటనకు భారీ మొత్తంలో నిధులను ఖర్చు చేయనుంది. అయితే, పర్యటన వివరాలపై అధికారులు కూడా స్పందించలేదు. కానీ, జాబితాలో జీహెచ్ఎం సీ నుంచి మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంఆర్డీసీఎల్ నుంచి ఎండీ దానకిషోర్, జేఎండీ గౌతమి, ఈడీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ దత్తు పంత్, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ వెంకట శేఖర్లతో కూడా 21 మంది బృందంతో మరో 30 మందితో ఎన్జీవోలు, ప్రజా, పర్యావరణ కార్యకర్తలు ఉన్నట్టు ఎంఆర్డీసీఎల్ వర్గాల ద్వారా తెలిసింది.
పేదల ఇండ్లను కూల్చి.. విదేశాలకు నేతలు
నగరంలో పేదల ఇండ్లను కూల్చివేయడంపై కాం గ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రివర్ బెడ్ ఆక్రమణల గుర్తింపుతోనే పెద్ద ఎత్తున ఆగ్ర హం వ్యక్తం చేశారు. లక్షలాది మంది పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన నిర్మాణాలను కూల్చి, రోడ్డు న పడేస్తున్న క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరు ను వ్యతిరేకిస్తున్నారు. ప్రక్షాళన విషయంలో ప్రభు త్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పర్యావరణానికి హాని చేసేలా ఉందనే వాదనలున్నాయి. అన్ని పార్టీల ను మూసీ పేరిట బద్నాం చేసేలా అఖిల పక్ష నేతలను బృందంలో చేర్చారనే విమర్శలున్నాయి. ఈ క్రమం లో మూసీ పరీవాహక జనాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భంగా, ఈ పర్యటనలో భాగస్వామ్యం కాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇండ్లను కూల్చి ప్రజాప్రతినిధులను విదేశాల్లో తిప్పాలనుకోవడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భయభ్రాంతులకు గురి చేసేలా..
మూసీ పరీవాహక జనాలను మార్కింగ్, కూల్చివేతల పేరిట భయభ్రాంతులకు గురిచేసేలా కాంగ్రెస్ అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఈ విదేశీ పర్యటనకు దూరంగా ఉన్నట్లుగా తెలిపారు. బృందంలో ఉ న్న ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్పేట్ ఎమ్మెల్యే లు దేవిరెడ్డి సుధీర్, బండారి లక్ష్మారెడ్డి, కాలే రు వెంకటేష్ పర్యటనను బాయ్‌కాట్ చేసినట్లు గా ప్రకటించారు. ఓ వైపు ఎలాంటి విధి విధానాలు, ప్రణాళికలు లేకుండానే మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను కూల్చుతూ, మరోవైపు అధ్యయనాల పేరిట విదేశాలకు తీసుకెళ్ల డం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతంలో చేసిన అధ్యయనాలు, చేసిన పర్యటన నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా.., ఇప్పుడు కొత్త గా చేస్తున్న పర్యటనతో జనాలకు ఒరిగేదేమీ లేదంటున్నారు. ప్రజాధనాన్ని విదేశాల్లో ఖర్చు చేయడమే తప్పా.. మూసీ పరీవాహక జనాలకు ఏ ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. మూ సీ ప్రక్షాళనలో ప్రభుత్వంపై విధానపరమైన విభేదాలు ఉన్నాయని, ప్రజాధనాన్ని లూటీ చేసేలా ఉన్న ఈ పర్యటనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మూసీ పర్యటనను వ్యతిరేకించారని సమాచారం.