Brinda | తమిళ స్టార్ హీరోయిన్ త్రిష ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్ ‘బృందా’ (Brinda). సూర్య వంగల ఈ వెబ్ డ్రామాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ వేదిక సోని లివ్‌లో నేరుగా విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సిరీస్‌ను ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోని లివ్ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇక తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ సిరీస్‌లో ఇంద్రజిత్ సుకుమారన్, ఆమని, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సిరీస్‌తో పాటు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, అజిత్ ‘విదా ముయార్చి’, మోహన్‌లాల్ ‘రామ్’ తదితర చిత్రాల్లో నటిస్తుంది త్రిష.
ALso Read..