హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాలు, బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
గురువారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతితో కలిసి అంగన్వాడీ కేంద్రాల్లో నియామకాలు, మౌలిక వసతులు, చిన్నారుల పోషకాహారం, పాఠశాల పూర్వ విద్య, దత్తత కేంద్రాలు, బాల్య వివాహాల నివారణపై సుదీర్ఘంగా సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి సూచించారు.