పరాయి పెత్తనం
లుప్తమైన రాజనీతి కాలంలో రాజ్యం వాచ్య రాజకీయాలదే! అందరి పలవరింత ఒకటే ఫలించని కల ఒకటే!
లుప్తమైన రాజనీతి కాలంలో
రాజ్యం వాచ్య రాజకీయాలదే!
అందరి పలవరింత ఒకటే
ఫలించని కల ఒకటే!
ఆసేతు హిమాచలం
పాదక్రాంతం కావడమే!
ఒకే దేశం ఒకే పార్టీ
చెరగని అందమైన నినాదం!
ప్రజాస్వామ్య స్ఫూర్తి
అడుగడుగున పరిహాసం!
ఎవరి మనసులో ఏముందో
వారి వారి మాటల్లో వాచ్యమే!
విడివిడిగా ఉంటే
ఎవరి కల సాకారం కాదు!
చేయి కలిపి చూడు నాతో
నీ ఊరేగింపు ఊహకందదు!
ఓపెన్ ఆఫర్ కడు సూపర్
ఇష్టమున్న మాటల్తో ముసుగు!
పెద్దాయన అన్ని మెట్లు దిగొచ్చి
ఆశ చూపిన దృశ్యం స్పష్టం!
ఎంతైనా ఇది రుచి మరిగిన చేప
అతను వల విసరడమే తరువాయి!
విశాల భారతావనిలో ఇప్పుడు
తెలంగాణ ఓ బంగారు చేప!
అదను కొరకు వేటగాళ్లు
వలలు సిద్ధం చేసుకుంటున్నారు!
మన కల నిజం చేసిన యోధుల్లారా
పహారా హుషార్!
ప్రమాదం రెక్క విప్పక మునుపే
సకల జనులను సిద్ధం చేయండి!!
– కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

