– వర్సిటీ జెడీ డా.బి. ధర్మానాయక్
రామగిరి, ఫిబ్రవరి 21 : డా.బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంను త్వరలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డా.బి.ధర్మానాయక్ తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్సిటీ రీజినల్ కో ఆర్డినేషన్ సెంటర్ పరిధిలోని నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాబారు. బీఆర్ఏఓయూలో యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులెందరో నేడు సమాజంలో మేథావులు, ఉన్నత ఉద్యోగులుగా, సాఫ్ట్‌వేర్‌తో పాటు వివిధ రంగాల్లో స్థిరపడినట్లు తెలిపారు. వారందరూ అల్యూమినిలో రిజిస్ట్రేషన్ కావాలని సూచించారు. దేశంలోనే బీఆర్ఏఓయూ డిజిటల్ యూనివర్సిటీగా పలు కార్యక్రమాలు, ఎంఓయూలు, నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉమెన్స్ కళాశాల బీఆర్ఏఓయూ కో ఆర్డినేటర్ డా.సుంకరి రాజారామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ॥ శ్రీనివాసారాజు, బీఆర్ఏఓయూ కౌన్సిలర్స్ బి.రామకృష్ణ, పెరిక మధు, అధ్యాపకులు పాల్గొన్నారు.