ప్రయాణాల్లో మలబద్ధకం అనేది చాలా మందికి తలనొప్పిగా మారుతుంటుంది. మందులు, సంప్రదాయ చిట్కాలు దీనికి ఉపశమనమని భావిస్తుంటారు. సరైన సంగీతం వినడం వల్ల ఈ సమస్యకు 50 శాతం వరకు చెక్ పెట్టొచ్చని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. 30 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా మలబద్ధకాన్ని కలిగించేలా రూపొందించిన డ్రైవింగ్ సిమ్యులేటర్‌లో పరీక్షించారు. ప్రయోగ సమయంలో వారి మెదడు చేసే కార్యకలపాలను 64 చానెల్ ఈఈజీ సహాయంతో గమనించారు.
వారు వింటున్న సంగీతాన్ని బట్టి తేడాలను పరిశీలించారు. అందులో మనసుకు ఆనందం కలిగించే పాటలు విన్నప్పుడు మలబద్ధక లక్షణాలు 57 శాతం తగ్గినట్లు, ఉత్సాహభరిత సంగీతం విన్నప్పుడు 48.3 శాతం మెరుగుదలను, దుఃఖ భరితమైన పాటలు వింటున్నప్పుడు 40 శాతం మాత్రమే ఉపశమనం కలిగినట్లు గుర్తించారు.
శ్రావ్యమైన సంగీతం విన్నప్పుడు మెదడులోని ఆక్సిపిటల్ ఏరియా (దృష్టి ప్రక్రియను నియంత్రించే భాగం)లో ఆల్ఫావేవ్స్ పెరిగినట్టు గమనించారు. ఇవి విశ్రాంతిని సూచించే మెదడు అలలు కాబట్టి సంగీతం వల్ల ప్రయాణికుడు నెగిటివ్ అనుభూతుల నుంచి దృష్టిని మళ్లించుకోగలిగాడు.
ఈ ప్రయోగంలో న్యూరల్ నెట్వర్క్ మోడల్ ఉపయోగించి ప్రయాణికుల మలబద్దక స్థాయిని 85.6 శాతం కచ్చితత్వంతో అంచనా వేశారు. దీనివల్ల సంగీతం కలిగించే మానసిక మార్పులు స్పష్టంగా వెల్లడయ్యాయి. భవిష్యత్తులో ట్రావెల్ యాప్‌లు, కార్ సిస్టమ్స్ ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా, వాళ్ల మూడ్‌కు అనుగుణంగా ఆటోమేటిక్ ప్లేలిస్ట్ ఏర్పాటు చేసి సుఖమయమైన ప్రయాణాన్ని
అందిస్తాయేమో!