భారీ అంచనాల మధ్య విడుదలైన బాలీవుడ్ (Bollywood) చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra). గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశాజనకంగా వసూళ్లు రాబడుతూ టీంలో జోష్ నింపుతోంది. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా నటించగా..స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, నాగార్జున (Nagarjuna), మౌనీరాయ్ కీ రోల్స్ పోషించారు.
ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్ల అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వరల్డ్ వైడ్గా రూ.160 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం. ఇటీవల కాలంలో విడుదలైన బాలీవుడ్ చిత్రాల్లో తాజా ఫిగర్ ఎక్కువ అనే చెప్పాలి. బ్రహ్మాస్త్ర హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో తెరకెక్కింది.
రానున్న రోజుల్లో బ్రహ్మాస్త్ర కలెక్షన్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా తెరకెక్కించారు. మూడు పార్టులుగా రాబోతుంది బ్రహ్మాస్త్ర.
Read Also : రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత