గజ్వేల్: గజ్వేల్ వేదికగా ఈనెల 17న నిర్వహించనున్న బాడీ బిల్డింగ్ పోటీల వాల్‌పోస్టర్‌ను బుధవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈనెల 17న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) ఆధ్వర్యంలో 250 మంది బాడీబిల్డర్స్తో ‘మి స్టర్ తెలంగాణ’కేసీఆర్ కప్‌ను నిర్వహిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.