బూర్గంపహాడ్, మే 06 : రక్తదానం ప్రాణదానంతో సమానమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో తన జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువత, నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ప్రతిఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడటం అలవాటు చేసుకోవాలన్నారు. రక్తదానం చేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని కాపాడటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదన్నారు. తొలుత నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్‌చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.