నార్నూర్, మార్చి 7 : నిరుపేద ఆడబిడ్డల తల్లిదండ్రులకు ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వరమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 54 మంది లబ్ధిదారులకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలపై ఆడబిడ్డల పెళ్లిభారం పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఓట్ల కోసం గల్లీకి వచ్చే నాయకులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నార్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సిబ్బందిని జడ్పీ చైర్మన్ సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పురుషులతో సమానంగా మహిళా వైద్య సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్, డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, నా ర్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, ఎం పీటీసీలు జాదవ్ రేణుక, భీంపూర్ సర్పంచ్ రాథో డ్ విష్ణు, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, కో ఆప్షన్ షేక్ దస్తగిరి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు యూనిస్ అక్బానీ, దుర్గే మహేందర్, రాథోడ్ సుభాష్, కనక ప్రభాకర్, సయ్యద్ ఖాశీం, రాథోడ్ రామేశ్వర్, లబ్ధిదారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గాదిగూడ ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 48 మంది లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్కా మోతిరామ్, ఎంపీపీ ఆడా చం ద్రకళ రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మర్సువనే యోగేశ్, సర్పంచ్ మెస్రం జైవంత్‌రావ్, భారత్, మెస్రం శేఖర్, ఆత్రం వామన్, లబ్ధిదారులు పాల్గొన్నారు.