గాడితప్పిన బీజేపీ పాలన
కేంద్రంలో పన్నెండేండ్ల క్రితం మొదలైన బీజేపీ పాలన ఇప్పుడు పూర్తిగా గాడితప్పింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీపై జనం పెట్టుకున్న ఆశలు పుష్కరకాలం తర్వాత అడియాశలయ్యాయి
కేంద్రంలో పన్నెండేండ్ల క్రితం మొదలైన బీజేపీ పాలన ఇప్పుడు పూర్తిగా గాడితప్పింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీపై జనం పెట్టుకున్న ఆశలు పుష్కరకాలం తర్వాత అడియాశలయ్యాయి. విఫలమైనది ఒక్క కేంద్ర సర్కార్ మాత్రమే కాదని, దాని నేతృత్వంలో భారత రాజ్యాంగమని జనం గుర్తిస్తున్నారు. 1950 జనవరిలో అమల్లోకి వచ్చిన భారత సంవిధానాన్ని పక్కదారి పట్టించిన ఘనత బీజేపీ నేతృత్వంలోని హిందుత్వ శక్తులదే. గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండేండ్లకు పైగా మోదీ సాధించిన ‘వికృత’ అనుభవం దేశ ప్రధానిగా దశాబ్దానికి పైగా కొనసాగడానికి ఉపకరించింది.
పార్లమెంటుకు 1984లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి లోక్‌సభలో సొంతంగా మెజారిటీ సీట్లు (282) సాధించిన మొదటి పార్టీ అయిన బీజేపీ 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ‘అందరినీ కలుపుకొని అందరి ప్రగతికి కృషి చేస్తాం’ అనే (సబ్ కా సాథ్ సబ్ కా వికాస్) మాటలు నీటిమూటలని తేలిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఇప్పుడు అన్ని రంగాల్లో కనిపిస్తున్నాయి.ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైన ఎన్నికల సంఘం సహా దాదాపు అన్ని రాజ్యాంగ సంస్థలనూ మోదీఅమిత్ షా సారథ్యంలోని సర్కార్ కుంగదీసింది. ఎప్పుడూ లేనిది భారత న్యాయవ్యవస్థ ప్రకటించే కొన్ని నిర్ణయాల వెనుక పాలకపక్షం ఒత్తిడి ఉన్నదేమోననే అనుమానం వ్యక్తమవుతున్నది. 75 ఏండ్ల నుంచి సాగుతున్న భారత ప్రజాస్వామిక వ్యవస్థను రాజ్యాంగం ప్రకారం నడువకుండా కాషాయ సర్కార్ తన స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా దుర్వినియోగం చేస్తున్నది.
కిందటేడాది పశ్చిమబెంగాల్ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైన ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ మిగిలిన రాష్ర్టాల్లోనూ (సర్) అస్తవ్యస్తంగా సాగుతున్నది. అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన బిహార్ సహా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ‘సర్’తో రూపొందించిన ఓటర్ల జాబితాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని రుజువవుతున్నది. ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్న బెంగాల్, అస్సాం వంటి రాష్ర్టాల్లో లక్షలాది మంది మైనారిటీల పేర్లను ‘సర్’ ప్రక్రియ పేరుతో ఓటర్ల జాబితాల నుంచి తొలగించడం ద్వారా బీజేపీ ఈ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. ఈ క్రమంలో ప్రజాస్వామ్యానికి పాతరేసే పనిని వేగవంతం చేస్తున్నది.
గుజరాత్లో తమ వరుస ఎన్నికల విజయాలకు అనుసరించిన ఫార్ములాను మరింత మెరుగుపరిచిన మోదీషా ద్వయం..బీజేపీకి అప్పటివరకూ సీఎం పదవి అందని హర్యానా, మహారాష్ట్ర, అస్సాం, పశ్చిమబెంగాల్ వంటి రాష్ర్టాలను తమ జెండా నీడలోకి తెచ్చుకున్నది. తన రాజకీయ ప్రత్యర్థులైన విపక్షాలను దేశద్రోహానికి పాల్పడే పార్టీలుగా, విదేశీ శక్తులతో కుమ్మక్కయిన పక్షాలుగా చిత్రించడంలో గొప్ప నైపుణ్యం సంపాదించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా వివిధ రాష్ర్టాల్లో పాలకపక్షాలుగా పనిచేసిన బీఆర్ఎస్ వంటి అనే ప్రాంతీయపక్షాలపై కూడా కమలం నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడడం రివాజుగా మారింది.
దేశంలోని అన్ని రాష్ర్టాల్లో పాగా వేయాలని, హస్తినలో తమ పాలన నిరాటంకంగా సాగిపోవాలన్న దురాశ ఫలితంగానే ‘సర్’ వంటి రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు కాషాయదళం పాల్పడింది. ఈ విషయంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పాలకపక్షం అడ్డగోలుగా వాడుకున్న తీరు దేశ ప్రజలను నివ్వెరపరుస్తున్నది.
ఫామ్6లో మార్పులు, కోట్లాది మంది ఓటర్ల (ఇప్పటివరకు 13.2 కోట్లు మంది) పేర్లను జాబితాల నుంచి తొలగించడానికి సీఈసీకి మార్గం సుగమం చేయడానికి 2023లోనే చట్టసవరణకు పాల్పడింది మోదీ సర్కార్. అక్రమాలకు పాల్పడినా కోర్టు విచారణ, శిక్షలు లేకుండా చట్టబద్ధ రక్షణ కల్పించడానికి కేంద్రం తీసుకున్న చర్యలు నేడు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. అంటే, కేంద్రంలో, రాష్ర్టాల్లో తమ అధికారం నిరంతరం కొనసాగడానికి బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని అర్థమవుతున్నది. బీజేపీ చట్టపరమైన రక్షణ ఫలితంగానే జ్ఞానేశ్ కుమార్ ‘సర్’ను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు.
ఈ అడ్డగోలు ప్రక్రియ విషయంలో తన సహచర ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చి ఆయన తన ఏకపక్ష నిర్ణయాలతో ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియతో ముందుకు సాగుతున్నారు. దాదాపు అన్ని రంగాల్లో విఫలమైనా ‘సర్’ ప్రక్రియలో లోటుపాట్లు బహిర్గతం అయ్యాకే మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రజల్లో పలుచనవుతున్నాయి. 13 కోట్లకు పైగా ఓటర్లను జాబితాల నుంచి ‘సర్’ పేరుతో తొలగించాక ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాల విషయం మీడియా వెల్లడించింది. దీంతో కేంద్ర సర్కార్ పునాదులు కదులుతున్నాయి.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక సంక్షోభం ముదురుతూనే ఉన్నది. గుజరాత్‌కు చెందిన తన అనుకూల పారిశ్రామిక కుటుంబాలకు ఎనలేని మేలు చేయడమే కేంద్ర సర్కార్ లక్ష్యమా? అనే అనుమానం కలుగుతున్నది. వాణిజ్య పోర్టులు, బడా ఎయిర్‌పోర్టుల నుంచి ఇంకా అనేక రంగాల్లో గౌతమ్ అదానీ నాయకత్వంలోని పారిశ్రామిక గూప్నకు, అంబానీల కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా మోదీషా ప్రభుత్వం ఈ పుష్కరకాలంలో తీసుకున్న చర్యలకు అంతే లేదు. ప్రఖ్యాత టాటా గ్రూప్‌లో అంతర్గత సంక్షోభం సమసిపోవడానికి మోదీ సర్కార్ దోహదం చేయకపోగా సమస్య జటిలం కావడానికి కొందరికి తోడ్పడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న, మధ్యతరహా పారిశ్రామిక యూనిట్లు (ఎస్ఎంఈలు) వేలాది సంఖ్యలో గుజరాత్ సహా అనేక రాష్ర్టాల్లో మూతపడినా వాటిని తెరిపించి నిరుద్యోగం తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యం.
ఇజ్రాయెల్, ఇరాన్ సంక్షోభాలకు తోడు ముడిచమురు ఉత్పత్తిలో అత్యంత కీలకమైన పశ్చిమాసియాలో యుద్ధాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. ఈ గ్లోబల్ ఆర్థిక సమస్యల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసినప్పుడు భారత ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరించడం ఆర్థికంగా అమెరికాకు ఎనలేని హాని చేస్తున్నది. ట్రంప్ బెందిరింపులు, ఒత్తిళ్ల మధ్య ఇటీవల అమెరికాతో భారత ప్రభుత్వం వాణిజ్య ఒప్పందం చేసుకున్నది. ఈ ఒడంబడిక కేంద్ర సర్కార్ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నది.
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’ పరీక్షప్రశ్నపత్రాలు మరోసారి లీకవడం దేశాన్ని కలవరపరిచింది. ఈ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీకేపీ), యువ బృందం చేపట్టిన ఉద్యమం మోదీ సర్కార్నుగడగడలాడించింది.
ఎవరి ఒత్తిడికీ లొంగరనే ‘ఇమేజ్’ను పక్కనపెట్టిన మోదీషా సీజేపీ బెదిరింపుల ఫలితంగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారు. 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన రాహుల్‌గాంధీ మొదటి పదేండ్లలో కేంద్రంలోని సంకీర్ణ సర్కార్ సారథి కాంగ్రెస్ నేతగా ఉన్నప్పటి నుంచి మొన్నటివరకు రాజకీయ పరిపక్వత, తెలివైన వ్యూహాలు లేని అమాయక ‘పప్పూ’గా పేరు సంపాదించారు. కేంద్ర సర్కార్ వేసిన తప్పటడుగులు, చేసిన అక్రమాల ఫలితంగా రాహుల్ తరచూ పాలకపక్షంపై విరుచుకుపడుతున్నారు.
మోదీషా ద్వయానికి తానంటే భయమని, తాము అధికారంలోకి వచ్చాక సీఈసీ జ్ఞానేశ్ సహా తప్పుచేసిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని రాహుల్ గట్టిగా చెప్తున్నారు. ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు రావాలని పదేపదే రాహుల్ సవాళ్లు విసురుతున్నారు. కేంద్ర సర్కార్ పాలనలో గందరగోళం, ఆర్థిక సంక్షోభం వంటి మోదీ వైఫల్యాల ఫలితంగా నేడు రాహుల్ నుంచి నవతరం యువతీయువకుల వరకూ ప్రధానిపై దుమ్మెత్తిపోస్తున్నారు. తొలి యూపీఏ సంకీర్ణ సర్కార్ తన రెండో పదవీకాలంలో ఎదుర్కొన్న సంక్షోభం వంటిదే నేడు మోదీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

