BRS | బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ (Rida Quddos) ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు. మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహ్మద్ బిన్ అలీ అల్ గుత్మి (Mohammed Bin Ali Al Gutmi) కూడా ఆమెతో పాటు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్లో చేరిన అనంతరం రిదా ఖుద్దూస్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల కోసం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మైనార్టీ సమాజం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. మరోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు నిజమైన అభివృద్ధి జరుగుతుందనే ఏకైక లక్ష్యంతో తాను పార్టీలో చేరుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా పని చేయడానికి బీఆర్ఎస్ లో చేరిన రిదా ఖుద్దూస్, మహ్మద్ బిన్ అలీ అల్ గుత్మిలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.