KTR | హైదరాబాద్‌ను గాలికి వదిలేసిన రేవంత్.. బస్తీ దవాఖానల్లో అందుబాటులో లేని మందు గోళీలు: కేటీఆర్
రేవంత్ సర్కార్ హైదరాబాద్‌ను గాలికొదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బస్తీ దవాఖానలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పార్టీ నాయకులతో కలిసి ఖైరతాబాద్‌లోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రాని సందర్శించారు.
హైదరాబాద్: రేవంత్ సర్కార్ హైదరాబాద్‌ను గాలికొదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బస్తీ దవాఖానలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పార్టీ నాయకులతో కలిసి ఖైరతాబాద్‌లోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రాని సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానలో సదుపాయాలను పరిశీలించారు. మందులు, పరికరాల పని తీరు, దవాఖానలో అందుతున్న వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు 4 నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాల విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని మహిళా డాక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో సమస్యలపై ఆరా తీశారు. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ హయాంలో ప్రజలకు, ముఖ్యంగా పేదలు అందరికీ అందుబాటులో ఉండేలా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారని తెలిపారు. వాటితో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఉచితంగా పరీక్షలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేసి, ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. నాలుగు ఐదు నెలలుగా బస్తీ దవాఖానాలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు. బస్తీ దవాఖానల్లో మందు గోళీలు కూడా అందుబాటులో లేవన్నారు. ప్రజారోగ్యం అంటే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో దీనితో అర్థమవుతుందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా నాలుగు టిమ్స్ దవాఖానలను ప్రారంభించిందని చెప్పారు. 90 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 10 శాతం పనులు చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు. బస్తీ దవాఖానలను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌ను రేవంత్ గాలికి వదిలేశారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ల లిస్టులో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దానం నాగేందర్ ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీకి ప్రచారం చేస్తున్నాడని నిలదీశారు. ఏఐసీసీ అంటే.. ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీలో గెలిచిన వాళ్లను తీసుకుని, వాళ్ల పార్టీ క్యాంపెయినర్ల జాబితాలో పెట్టారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేకపోతున్నారని,.. వాళ్ళకి సిగ్గనిపిస్తలేదా అని ప్రశ్నించారు. స్పీకర్ దగ్గర తాము పార్టీ మారలేదని అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- basthi dawakhana
- BRS
- Hyderabad
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

