Trump – Putin meet | హంగరీలో జరగాల్సిన ట్రంప్-పుతిన్‌ల సమావేశం వాయిదా..!
Trump - Putin meet | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు (Russia president) వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) మరోసారి భేటీకి సిద్ధమవుతున్నారు. హంగరీ (Hungary) లోని బుడాపెస్ట్‌ను ఈ భేటీకి వేదికగా నిర్ణయించారు.
Trump – Putin meet : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు (Russia president) వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) మరోసారి భేటీకి సిద్ధమవుతున్నారు. హంగరీ (Hungary) లోని బుడాపెస్ట్‌ను ఈ భేటీకి వేదికగా నిర్ణయించారు. అయితే ఈ సమావేశం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇరుదేశాల అధ్యక్షుల సమావేశానికి ముందు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లావ్రోవ్ల మధ్య సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఇది నిరవధికంగా వాయిదా పడిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకుగాను వీరు భేటీ కావాల్సి ఉందని రష్యా తెలిపింది.
ఈ సమావేశం నిలిచిపోవడానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఈ క్రమంలోనే రూబియో, లావ్రోవ్లు సోమవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. యుద్ధానికి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు.. రష్యా, అమెరికాల మధ్య సహకారానికి సంబంధించి ఈ భేటీ ప్రాముఖ్యతను రూబియో చెప్పినట్లు స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.
అయితే ఉక్రెయిన్ వివాదం శాంతియుతంగా పరిష్కరించే విషయంపై వీరి మధ్య బేధాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ట్రంప్-పుతిన్‌ల వచ్చేవారం భేటీకి సంబంధించి సిఫార్సు చేసేందుకు రూబియో అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మంత్రులు ఈ వారంలో మళ్లీ మాట్లాడుకునే అవకాశం ఉందన్నారు.
ఈ ఫోన్ కాల్‌పై క్రెమ్లిన్ స్పందించింది. ట్రంప్, పుతిన్‌ల భేటీకి సంబంధించి ఇరుదేశాల మంత్రుల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే అంశంపై ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఇప్పటికే ఇరుదేశాధినేతలతో ట్రంప్ మాట్లాడినప్పటికీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ క్రమంలోనే ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడారు. ఆ సమయంలోనే హంగరీలో మరోసారి భేటీ అవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. జెలెన్స్కీతో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

