హుజూరాబాద్ రూరల్, మే 7 : కరీంనగర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై గూండాగిరీ చేసిన బీజేపీ రౌడీమూకలు.. హుజూరాబాద్‌లోనూ దాడులతో పేట్రే గిపోయారు. కరీంనగర్ నుంచి కౌశిక్‌రెడ్డిని పోలీసులు హుజూరాబాద్ శివారు కేసీ క్యాంప్‌లో ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకొచ్చారు. ఎలాంటి ఘటనలు చో టుచేసుకోకుండా ముందస్తుగా ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాల యం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే కౌ శిక్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న బీజేపీ నా యకులు కర్రలతో ఉన్న పార్టీ జెండాల తో ఎమ్మెల్యే కార్యాలయంపై దాడికి చే సేందుకు ప్రయత్నించారు. అప్పటికే కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు బయటికి వ చ్చి ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే ఆఫీస్ ఆవరణలోకి తీసుకుపోయి గేట్లు వేసి నిర్బంధించారు.
హుజూరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీ మాధవి పో లీసుల బలగాలతో ఎమ్మెల్యే కార్యాల యం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. హుజూరాబాద్ నుంచి భీమదేవరపల్లికి వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు. ఎమ్మెల్యే ఆఫీస్‌ను నుంచి ఒక్కరిని కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు.