పవన్‌కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పురుషః’. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల కోటేశ్వర రావు నిర్మాత. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. గురువారం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ..విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, ఆద్యంతం వినోదంతో మెప్పిస్తుందని అన్నారు.
ప్రచార చిత్రాలకు వచ్చిన స్పందన సినిమా విజయంపై నమ్మకాన్ని పెంచిందని నిర్మాత చెప్పారు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్నందిస్తున్నారు.