BRS | బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహజ్వాల.. గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడికి తీవ్ర నిరసన
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
- ‘బండి సంజయ్ డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు
- రోడ్డుపై నిరసనకు యత్నం.. అడ్డుకొన్న పోలీసులు
- నినాదాలు, నిరసనల నడుమ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్ పట్టణానికి తరలించిన పోలీసులు
కరీంనగర్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. దాడి విషయం తెలిసి పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ మూకలు ధ్వసం చేసిన అద్దాలు, కిటికీలు, ఫర్నిచర్, కౌశిక్‌రెడ్డి ఫార్చూనర్ వాహనాన్ని చూసిన నాయకులు, శ్రేణులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. తర్వాత పెద్ద ఎత్తున అందోళనకు దిగారు. కార్యాలయం వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించడంపైనా మండిపడ్డారు. తమ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా పోలీసులు తమనే అడ్డుకుంటున్నారని అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ‘బండి సంజయ్ డౌన్‌డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ శ్రేణులు బయలుదేరేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని క్యాంపు కార్యాలయంలోకి పంపించారు. కరీంనగర్‌లోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బండి సంజయ్‌కి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, కార్పొరేటర్లు యూసు ఫ్, గడ్డి ప్రదీప్, అలీ, మాజీ కార్పొరేటర్లు డిండిగాల మహేశ్, బోనాల శ్రీకాంత్, ఐలేందర్‌యాదవ్, ఎడ్ల అశోక్, వాల రమణారావు, బీఆర్ఎస్ నాయకులు గంటల రేణుక, శ్రీనివాస్‌రెడ్డి, వసంతరావు, ఆరె రవి, ఎండీ సైఫ్, ఓలాల శ్రీనివాస్‌గౌడ్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

