అఖిలేశ్ వ్యాఖ్యలపై వివాదం రేపిన బీజేపీ
లక్నో: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా భారత స్వాతంత్య్రం కోసం పోరాడారంటూ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘పటేల్, గాంధీజీ, నెహ్రూ, జిన్నా ఒకే విద్యాసంస్థలో చదువుకొన్నారు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడారు’ అని ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ అన్నారు. ముస్లిం ఓట్ల కోసమే జిన్నాను అఖిలేశ్ కీర్తిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. అఖిలేశ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సీఎం యోగి డిమాండ్ చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ స్పందిస్తూ ‘జిన్నాకు భారత ముస్లింలకు సంబంధం లేదు. అఖిలేశ్ చరిత్రను చదవాలి’ అని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: అఖిలేశ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని అఖిలేశ్ ప్రకటించారు. అయితే, ఈ అంశంపై పార్టీదే తుది నిర్ణయమని చెప్పారు. ఎస్పీ, ఆర్ఎల్డీ మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు.