Bindu Ghosh : తమిళ సినీ పరిశ్రమకు చెందిన అలనాటి ప్రముఖ నటి బిందు ఘోష్ (Bindu Ghosh) మృతిచెందారు. 76 ఏళ్ల బిందు ఘోష్ గత కొంతకాలంగా గుండె సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. సోమవారం కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
కోజి కూవుతూ (Kozhi Koovuthu), కళాథర్ కన్నమ్మ (Kalathur Kannamma) సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. పలు సినిమాల్లో డ్యాన్సింగ్తో కూడా ఆమె అదరగొట్టారు. ఆదివారం మధ్యాహ్నం తన తల్లి అనారోగ్యంతో మరణించిందని, సోమవారం ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించామని బిందు ఘోష్ కుమారుడు శివాజీ చెప్పారు.
బిందు ఘోష్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి గురించి, ఆర్థిక పరిస్థితి గురించి వెల్లడించారు. బిందు ఘోష్ కమల్ హాసన్, రజినీకాంత్, శివాజీ గణేషన్, మోహన్‌లాల్, ప్రభు, విజయకాంత్‌తో పలు సినిమాలు చేశారు.