Rasgullas | బీహార్ (Bihar)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో (Bihar wedding) రసగుల్లా (Rasgullas) చిచ్చుపెట్టింది. ఫంక్షన్ హల్లో వరుడు, వధువు తరఫు కుటుంబాల వారు బాహాబాహీకి దిగారు. ఈ గొడవతో చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది. బోధ్ గయలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గత నెల 29న బక్రౌర్ గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో వివాహ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుకలో భాగంగా పసందైన వంటకాలను వడ్డించారు. అయితే, రసగుల్లాలు తక్కువయ్యాయంటూ వధువు కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బంధువులు ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకుంటూ దారుణంగా కొట్టుకున్నారు. కొందరు పరస్పర ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనతో వధువు తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, స్థానిక పోలీస్ స్టేషన్లో వరుడి కుటుంబంపై వరకట్నం కేసు పెట్టారు. గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
WATCH | Bihar wedding erupts into violent fight over shortage of rasgullas.
Police said the bride’s family reported a dowry case after the wedding was called off because of the fight. pic.twitter.com/S2cVTggEQU
— The Tatva (@thetatvaindia) December 5, 2025
Also Read..
IndiGo: ఇండిగో కౌంటర్ వద్ద కేకలు పెట్టిన విదేశీ మహిళ.. వీడియో
Nitish Kumar | క్రియాశీల రాజకీయాల్లోకి సీఎం కుమారుడు..!
IndiGo | సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం.. విమానాల రద్దుపై పిటిషన్ దాఖలు