తిరువనంతపురం: కేరళ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటతి(MLA Rahul Mamkootathil)ల్కు రక్షణ కల్పించింది. ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేయవద్దు అని హైకోర్టు ఇవాళ తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే రాహుల్‌పై రేప్, అబార్షన్ కేసు నమోదైన విషయం తెలిసిందే. జస్టిస్ కే బాబుకు చెందిన ముందస్తు బెయిల్ పిటిషన్ డిసెంబర్ 15వ తేదీన విచారించనున్నారు. అయితే అప్పటి వరకు ఎమ్మెల్యేను అరెస్టు చేయకూడదని కోర్టు చెప్పింది. అరెస్టు చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే రాహుల్ గత వారం నుంచి పరారీలో ఉన్నారు. మీమమ్ పోలీసులు రిజిస్టర్ చేసిన కేసులో ఎమ్మెల్యేకు తాత్కాలిక ఊరట కల్పించారు.
రేప్, అబార్షన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రాహుల్‌ను కాంగ్రెస్ పార్టీ వెలివేసింది. సెషన్స్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నాటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. హైకోర్టుకు సమర్పించిన పిటీషన్లో.. కేసు దర్యాప్తునకు సహకరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సక్రమ పద్ధతిలో కాకుండా తనపై ఫిర్యాదును నేరుగా సీఎంకు అందజేశారని తన పిటీషన్లో రాహుల్ పేర్కొన్నారు. తమ మధ్య ఉన్న రిలేషన్ ఏకాభిప్రాయంతోనే జరిగిందని, తన స్వంత నిర్ణయంతోనే ఆమె తన గర్భాన్ని తీసివేసుకున్నట్లు ఎమ్మెల్యే రాహుల్ తెలిపారు.