ముంబై: దేశవ్యాప్తంగా ఇండిగో(IndiGo) విమానాలు వేల సంఖ్యలో రద్దు అయిన విషయం తెలిసిందే. అయిదో రోజు కూడా ఇవాళ విమానాలను రద్దు చేశారు. దీంతో ఓ విదేశీ మహిళ ఇండిగో కౌంటర్ వద్ద రుసరుసలాడారు. ముంబై విమానాశ్రయంలో ఉన్న ఇండిగో కౌంటర్ వద్ద హంగామా చేసింది. నైజీరియా దేశస్థురాలైన ఆమె తమ భాషలో గట్టి అరిచింది. ఎయిర్‌లైన్ కౌంటర్ వద్ద టాప్ ఎక్కి మరీ ఇండిగో సిబ్బందిపై ఆవేశంగా ఊగిపోయింది. ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
కౌంటర్ విండో వద్ద ఏకధాటిగా అరిచిన ఆమె ఆ విండోపైకి ఎక్కింది. తీవ్ర అసహనానికి గురైన ఆమె తన బాధను చెప్పుకున్నది. అక్కడే ఇండిగో విమానాల కోసం పడిగాపులు కాస్తున్న వందల సంఖ్యలో ప్రయాణికులు కూడా ఆమెకు మద్దతు నిలిచారు. ఇరత ప్రయాణికుల్ని ఉద్దేశిస్తూ కూడా ఆమె అరుపులు, కేకలు పెట్టింది. అయిదో రోజు ఇవాళ 4 విమానశ్రయాల్లో సుమారు 400 విమానాలను రద్దు చేశారు.
ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దవడంతో సిబ్బందిని నిలదీసిన నైజీరియన్ మహిళ https://t.co/xIC2cQJeDW pic.twitter.com/m15qQ0nhMV
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2025