AMB Cinemas | భారత స్టార్ ఆల్‌రౌండర్, స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా హైదరాబాద్‌లోని మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) మాల్‌ను సందర్శించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ విషయాన్ని ఏఎంబీ సినిమాస్ బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. బంతిని స్టేడియం వెలుపలికి పంపడంలోనే కాకుండా, వినోదం కోసం సరైన స్థలాన్ని ఎంచుకోవడంలో కూడా హార్దిక్ పాండ్యా తన ‘ఆల్-రౌండర్’ ప్రతిభను చూపించాడని ఏఎంబీ సినిమాస్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. హార్దిక్ రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమాను చూడటానికి థియేటర్‌కి వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తుండగా.. అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడటానికి వచ్చి ఉండవచ్చని సమాచారం.
From hitting the ball out of the park to hitting the perfect spot for entertainment, @hardikpandya7 shows exactly what it means to be an all-rounder 🤩🏏#HardikPandya #IndianCricketer #SpottedAtAMB #AMBCinemas pic.twitter.com/kON3KWLwjZ
— AMB Cinemas (@amb_cinemas) December 6, 2025