Bihar | పాట్నా: కోటీశ్వరులు కావాలంటే పేరు వెనకాల డిగ్రీలు, ఐదంకెల జీతాలు, అపారమైన మేధాసంపత్తి ఉండాలా..? అక్కర్లేదు! కష్టపడేతత్వంతో పాటు ఆవగింజంత అదృష్టమున్నా లక్ష్మీదేవి మన గుమ్మంలోకి పరుగెత్తుకుంటూ వస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ. బీహార్‌లోని అర్రా జిల్లా ఖోడా గ్రామానికి చెందిన దీపు ఓఝా.. 8వ తరగతి మధ్యలోనే ఆపేసి, స్థానికంగా ఉన్న ఓ గ్యారేజీలో మెకానిక్‌గా ఉంటూ అరకొర జీతంతో బతుకుబండి లాగేస్తున్నాడు.
కానీ గత ఆదివారం రాత్రి ఐపీఎల్లో ముగిసిన కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్ తర్వాత అతడి జాతకమే మారిపోయింది. దీపు బ్యాంక్ ఖాతాలో ఉన్నఫళంగా రూ. 1.5 కోట్లు చేరాయి. డీమ్11 యాప్ ఫ్యాంటసీ గేమ్ ఆడిన అతడు రస్సెల్‌ను తన జట్టుకు కెప్టెన్‌గా ఎంచుకోవడంతో ఓఝా పంట పండింది.