Bigg Boss 9 | భరణి ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 9 లో ఆట పూర్తిగా మారిపోయింది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు తమ స్ట్రాంగ్ గేమ్‌తో పాత కంటెస్టెంట్లలో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించారు. ఫలితంగా హౌస్‌లో మాటామాటా, గొడవలు, వ్యూహాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఇమ్మానుయేల్ తనూజని నామినేట్ చేస్తూ హౌస్‌లో పెద్ద చర్చకు కారణమయ్యాడు. గత వారం కళ్యాణ్‌కి నామినేషన్ స్లిప్ ఇచ్చినందుకు హోస్ట్ నాగార్జున అతనికి క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. “నువ్వు నామినేట్ చేయాలనుకుంటే నువ్వే చేయి, ఇంకొకరిని చేయమని చెప్పొద్దు” అని నాగ్ స్పష్టంగా హెచ్చరించడంతో, ఈ వారం ఇమ్మానుయేల్ తనూజని నామినేట్ చేశాడు.
కెప్టెన్సీ రూమ్‌లో అర్ధరాత్రి సమయంలో ఇమ్మానుయేల్ .. రీతూ చౌదరి, డీమాన్‌లతో చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా తనూజ, కళ్యాణ్ బిహేవియర్ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. “బెడ్ టాస్క్ ముందు తనూజను సేవ్ చేస్తానని చెప్పాను. కానీ లాస్ట్‌లో ఆడినప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు. కళ్యాణ్ స్లిప్ ఇచ్చినప్పుడు అతనితో కలిసి చుట్టాలు అయిపోయారు. నేను శత్రువునయ్యా. ఇప్పుడు కూడా తనూజ ట్రోఫీ పట్టుకున్నా, నా అభిప్రాయం మారదు, ఆమె సేఫ్‌గా ఆడింది,” అని ఇమ్మానుయేల్ స్పష్టం చేశాడు.
తనూజ గేమ్‌పై ఇంత తీవ్రంగా స్పందించిన ఇమ్మానుయేల్ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ వ్యాఖ్యలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇమ్మానుయేల్ నిజం చెప్పాడని అంటుండగా, మరికొందరు ఇది ప్యూర్ జెలసీ అని అంటున్నారు. భరణి వెళ్ళిన తర్వాత హౌస్‌లో ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోతుండగా, ఈ నామినేషన్ ఎపిసోడ్ బిగ్‌బాస్ 9లో మరో హైలైట్‌గా నిలవనుంది. ఇక ఎనిమిదో వారం నామినేషన్ విషయానికి వస్తే ఈ వారం హౌజ్‌ని వీడేందుకు నామినేట్ అయిన వారిలో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో పవన్, తనూజ, కళ్యాణ్, రాము రాథోడ్, రీతూ చౌదరీ, సంజనా, దివ్వెల మాధురి, గౌరవ్ నామినేట్ కాగా, ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అనేది ఆసక్తికరంగా మారింది.