నా కోసం ఆ వెన్నెల..
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రేమకథాచిత్రం ‘ఓ చెలియా..’. ఎం.నాగరాజశేఖర్రెడ్డి దర్శకుడు. రూపాశ్రీ కొపురు నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు.
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రేమకథాచిత్రం ‘ఓ చెలియా..’. ఎం.నాగరాజశేఖర్రెడ్డి దర్శకుడు. రూపాశ్రీ కొపురు నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. మంగళవారం ఈ సినిమాలోని ఓ ప్రేమగీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ఈ పాటను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘నా కోసం ఆ వెన్నెల..’ అంటూ సాగే ఈ ప్రేమగీతానికి శివ సాహిత్యం అందించగా, ఎం.ఎం.కుమార్ స్వరపరిచారు. మేఘన, మనోజ్ కలిసి ఆలపించారు. హీరోహీరోయిన్ల ప్రేమను ఆవిష్కరించేలా ఈ పాట సాగింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. అజయ్‌ఘోష్, భోగిరెడ్డి శ్రీనివాస్, సారిపల్లి సతీశ్, యశోద ఆర్.కొలిశెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా: సురేశ్ బాలా, నిర్మాణం: ఎస్ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరాదేవి ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

