CSK vs SRH : చెన్నై సూపర్ కింగ్స్ కంచుకోటలో సన్రైజర్స్ హైదరాబాద్(SRH)కు భువనేశ్వర్ తొలి బ్రేక్ ఇచ్చాడు. డేంజరస్ అజింక్యా రహానే(9) వికెట్ పడగొట్టాడు. పరగులు రాకపోవడంతో ఒత్తిడికి లోనైన రహానే భారీ షాట్ ఆడి షెహ్బాజ్ చేతికి చిక్కాడు. దాంతో, 19 రన్స్ వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్(18), డారిల్ మిచెల్(1)లు ఆచితూచి ఆడుతున్నారు. 4 ఓవర్లకు చెన్నై స్కోర్.. 30/1.
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కమిన్స్ సేన.. సూపర్ బౌలింగ్ చేస్తోంది. భువీ తొలి ఓవర్లో నాలుగు రన్స్, ఆ తర్వాత నితీశ్ రెడ్డి 9 పరుగులు ఇచ్చారు.