న్యూఢిల్లీ : ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మౌనం వీడారు. తనపై వస్తున్న పుకార్లకు కొట్టిపడేశారు. టెస్ట్ ఆడటం లేదని నేనెప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. మూడురకాల ఫార్మాట్లకు సిద్ధంగా ఉన్నానని సెలక్టర్లకు చెప్పకనే చెప్పారు. తాను ఏ ఫార్మాట్‌కైనా ఆడుతానంటూ ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక కాకపోవడంపై కొనసాగుతున్న మీడియా నివేదికలను తోసిపుచ్చాడు. భువనేశ్వర్ ఇకపై టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడటం లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయకూడదని సూచించాడు. నేను మూడు ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నానని, ఎంపికకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
నేను టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఇష్టపడనని నా గురించి మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. మూడు ఫార్మాట్లకు నాకు నేను సిద్ధం చేసుకున్నాను. నాకు సంబంధం లేకుండా ఎంపిక జరుగుతుంది. భవిష్యత్‌లో కూడా తప్పుడు వార్తలు రాయవద్దని కోరుకుంటున్నా అని ట్విట్టర్ భువి రాశారు.
13 రోజులు ప్రధానిగా వాజ్‌పేయి.. చరిత్రలో ఈరోజు
ఆఫ్ఘన్-తాలిబాన్ల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం
పంచన్ లామా సమాచారం ఇవ్వండి.. చైనాను అడిగిన అమెరికా
స్పైస్‌జెట్ నిర్వాకం.. రోజంతా పైలట్లకు జాగారం..
టీకాలు తీసుకున్నా.. మాస్క్‌లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
–తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..