న్యూఢిల్లీ, మార్చి 30: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భెల్ మరో భారీ ఆర్డర్‌ను దక్కించుకున్నది. తెలంగాణలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టిన ఎన్టీపీసీ నుంచి ఈ భారీ ఆర్డర్ లభించినట్టు కంపెనీ పేర్కొంది.
ఈ ఆర్డర్ విలువ రూ.13,500 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. అక్టోబర్ 2024లో నిర్వహించిన బిడ్డింగ్‌లో పాల్గొన్న భెల్..రెండేండ్ల తర్వాత ఈ ఆర్డర్ కొలిక్కి రావడం విశేషం. తెలంగాణలో ఎన్టీపీసీ నిర్మించతలపెట్టిన మూడు 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు డిజైనింగ్, ఇంజినీరింగ్, తయారీ, సరఫరా చేయాల్సి వుంటుందని పేర్కొంది.