భగ్గుమన్న పుత్తడి, వెండి.. రూ.3,700 పెరిగిన తులం ధర
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఈ రెండు లోహాల ధరలు 3 శాతం వరకు ఎగబాకాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
- రూ.7 వేలు అధికమైన కిలో వెండి
న్యూఢిల్లీ, మార్చి 30 : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఈ రెండు లోహాల ధరలు 3 శాతం వరకు ఎగబాకాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. కిలో వెండి ఏకంగా రూ.2.37 లక్షలకు చేరుకోగా, బంగారం రూ.1.51 లక్షలు అధిగమించింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి కిలో వెండి రూ.7 వేలు లేదా 3.04 శాతం అందుకొని రూ.2,37,000కు చేరుకున్నది. గత శుక్రవారం ఈ ధర రూ.2.30 లక్షలుగా ఉన్నది. అలాగే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.3,700 లేదా 2.5 శాతం అధికమై రూ.1,51,500 పలికింది.
అంతకుముందు ఇది రూ.1,47,800గా ఉన్నది. పెండ్లిళ్ల సీజన్ ప్రారంభంకావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు పసిడి కొనుగోళ్లు ఊపందుకున్నాయని, తద్వారా ధరలు భారీగా పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీస్ సౌమిల్ గాంధీ తెలిపారు. రూపాయి పతనం కూడా ధరలు పెరగడానికి పరోక్షంగా కారణమైందన్నారు. ఈ నెల 2 నుంచి ఇప్పటి వరకు బంగారం ధర రూ.21,300 లేదా 12.3 శాతం తగ్గగా, వెండి రూ.63 వేలు లేదా 21 శాతం చొప్పున పతనం చెందాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 38.68 డాలర్లు లేదా ఒక్క శాతం బలపడి 4,531.67 డాలర్లకు చేరుకోగా, వెండి 1.35 శాతం అందుకొని 70.72 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

