భీమ్గల్, జూలై 14 : నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ బొదిరే నాగమణి స్వామి ప్రయాణిస్తున్న కారు సోమవారం అర్ధరాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. తమ కుమారుడి చికిత్స నిమిత్తం ఆర్మూర్ దవాఖానకు వెళ్లి వస్తుండగా భీమ్గల్ పట్టణ శివారులోని కేసీఆర్ కాలనీ వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడింది.
కారు ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో చైర్పర్సన్ నాగమణి, ఆమె భర్త స్వామి, కుమారుడు, కుమార్తె సురక్షితంగా బయటపడ్డారు. వారిని పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.