అచ్చంపేట రూరల్: సగర కుల గురువు భగీరథ మహర్షి (Bhagirath Maharshi ) జయంతి ( Jayanti ) వేడుకలను అచ్చంపేటలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు బాబు సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సగరులకు రాజకీయ రంగంలో అవకాశాలు కల్పించాలని కోరారు.
ఆర్థికంగా సామాజికంగా తోడ్పాటును అందించాలని డిమాండ్ చేశారు. సగరుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు చైతన్యంగా ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ , తాలూకా కన్వీనర్ వెంకటయ్య, సూర్యనారాయణ, శ్రీనివాసులు, రాము , రాజు , రమేష్, కృష్ణ పాల్గొన్నారు.