బెంగళూరు: స్టార్ రైడర్ పవన్ షెరావత్ 18 పాయింట్లతో చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్లో బెంగళూరు బుల్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు బుల్స్ 38-31తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. బెంగళూరు తరఫున పవన్ వన్ మ్యాన్ షో కనబర్చగా.. జైపూర్ తరఫున అర్జున్ (13) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో ప్రస్తుతం 28 పాయింట్లు ఖాతాలో ఉన్న బెంగళూరు పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పట్నా పైరెట్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 30-30తో ‘డ్రా’గా ముగిసింది. కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకుల్లేకుండా ఖాళీ మైదానాల్లో జరుగుతున్న ఈ లీగ్‌లో శుక్రవారం బెంగాల్ వారియర్స్‌తో హర్యానా స్టీలర్స్.. జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి.