కోల్కతా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో హింస పేట్రేగిపోతున్నది. బుధవారం దక్షిణ 24 పరగణాలు, బంకురా జిల్లాల్లో ఘర్షణలు చెలరేగడంతో అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టారు.
ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్), టీఎంసీ నేతల మధ్య ఘర్షణ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బంకురా జిల్లాలో ఘర్షణలకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. టీఎంసీ మూకలు దాడులకు తెగ బడ్డాయనే ఆరోపణలను టీఎంసీ ఖండించింది.