Cab drivers | ఇందిరమ్మ ఇళ్ల బిల్లు కేటాయింపులు(Indiramma housing bill) లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. జీవనోపాధి కోసం క్యాబ్‌లు, మినీ వ్యాన్లు నడుపుతూ, ఉండేందుకు ఇళ్లు లేక ఇందిరమ్మ ఇల్లు కోసం పలువురు క్యాబ్ డ్రైవర్లు(Cab drivers )దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో వారిని అర్హులుగా నిర్ధారించిన కేద్ర ప్రభుత్వం తీరా ఇల్లు నిర్మించుకున్నాక బిల్లు మంజూరు చేసే సమయంలో అనర్హులుగా గుర్తిస్తున్నది. క్యాబ్ డ్రైవర్లను కారు ఓనర్లుగా చూపుతూ బిల్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది. కారు అమ్మేసినా అందని బిల్లులు అందక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
వారికి నాలుగు చక్రాల వాహనం ఉందని, వారు పేదవారు కాదని బిల్లు చెల్లింపులో మెలికలు పెడుతున్నది. దీంతో వాహనం అమ్మేసి కొందరు, ఇతరుల పేర్లపై బదిలీ చేసి మరికొందరు అఫిడవిట్లు సమర్పించినా ఫలితం దక్కకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 వేల మంది లబ్ధిదారులు ఇదే జాబితాలో బిల్లు రాక ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు అర్హత ఉందంటేనే అప్పు చేసి ఇల్లు కట్టుకున్నామని, ఇప్పుడు అర్హులు కాదని బిల్లులు ఆపేస్తే తమ పరిస్థితి ఏంటని లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.