బచ్చన్నపేట ఆగస్ట్ 20 : రైతులకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ ఆరోపించారు. బుధవారం బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కో-ఆపరేటివ్ సొసైటీ సంఘం గోదాంలో యూరియా పూర్తిస్థాయిలో రాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఆధార్ కార్డు ఒకరోజు ఇచ్చి మరో రోజు యూరియా తీసుకుపోవాలని నిబంధనలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియాను అందించాలని లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రావుల రవీందర్ రెడ్డి , మిన్నలాపురం ఎల్లయ్య, రామగల అశోక్, గంగారమైన సమ్మయ్య, కనకచారి తదితరులు పాల్గొన్నారు.