Kishkindhapuri | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన చిత్రం కిష్కింధపురి (Kishkindhapuri). కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కాగా కిష్కింధపురి మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే.
కిష్కింధపురి ప్రస్తుతం వన్ ఆఫ్ ది లీడింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తాజాగా మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. కిష్కింధపురి ఇక తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కిష్కింధ పురి చిత్రాన్ని అక్టోబర్ 24 నుంచి ఆయా భాషల్లో చూసేయొచ్చు. మరిన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇంకేంటి మీకు ఏ భాషలో చూడాలనిపిస్తే ఆ భాషలో చూసేయండి మరి. అయితే హిందీ వెర్షన్‌కు సంబంధించి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. కిష్కింధపురిలో సాండీ మాస్టర్, హైపర్ ఆది, ప్రేమ, తనికెళ్లభరణి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు.
Kishkindhapuri in Tamil!
Beyond emotions, bringing the movie to your language!
Premieres October 24ᵗʰ only on @Zee5Tamil@BSaiSreenivas @anupamahere @Koushik_psk @sahugarapati7 @chaitanmusic @Shine_Screens#Kishkindhapuri #BellamkondaSreenivas #AnupamaParameswaran #ZEE5… pic.twitter.com/uaiuhvM2OE
— ZEE5 Tamil (@ZEE5Tamil) October 22, 2025
Deepika Padukone | ప్రపంచానికి తన కూతురిని పరిచయం చేసిన దీపికా పదుకొణే.. పాప ఎంత క్యూట్‌గా ఉంది.!
Kotha Lokah Movie | ‘కొత్త లోక’ని తెలుగులో తీస్తే డిజాస్టర్ అయ్యేది : నిర్మాత నాగవంశీ