న్యూఢిల్లీ : నైట్రేట్లు ఎక్కువగా ఉండే బీట్రూట్ జ్యూస్ వయోధికుల్లో రక్తపోటు(బీపీ)ను తగ్గిస్తుందని ఫ్రీ రాడికల్ బయాలజీ అండ్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. బీట్రూట్ జ్యాస్ తాగినప్పుడు వాళ్ల నోళ్లలోని సూక్ష్మజీవుల్లో మార్పు వల్ల బీపీ తగ్గుతుందని తెలిపింది.
నైట్రేట్ అధికంగా ఉన్న బీట్రూట్, తోటకూర, బచ్చలికూరల వంటి ఆహారం తిన్నప్పుడు నోట్లోని నైట్రేట్లు నైట్రిక్ ఆమ్లంగా మారతాయని పేర్కొన్నారు. ఇది రక్త నాళాలను శాంతపరిచి రక్త ప్రవాహం మెరుగవడానికి సహాయం చేస్తుందని అధ్యయనం తెలిపింది. బీట్రూట్ జ్యూస్ తాగడం వైద్యపరంగా ముఖ్యమైనదిగా, గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు తోడ్పడేదిగా పరిశోధకులు భావిస్తున్నారు.