బెంగళూరు, సెప్టెంబర్ 2: బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) రూ.102 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో మరో ముగ్గురికి కూడా రూ.50 కోట్లకు పైగా భారీ జరిమానా విధించారు. ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న రన్యారావు, మరో ముగ్గురికి డీఆర్ఐ అధికారులు మంగళవారం 2,500 పేజీల జరిమానా నోటీసులు అందజేశారు.
కాగా, రన్యారావు ఈ ఏడాది మార్చి 3న 14.8 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులకు చిక్కింది. ఆమె కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి కే రామచంద్రరావు సవతి కుమార్తె కావడం గమనార్హం.