న్యూఢిల్లీ : మన చంద్రుడు క్రమంగా కుంచించుకుపోతున్నాడు. వేలు, లక్షల సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్నది. దాని పరిమాణం, ఉపరితలంపై వచ్చే మార్పులు భూమిపై తప్పక ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనం గుర్తించింది. దీనిపై ‘ప్లానెటరీ సైన్స్’ జర్నల్ కథనం ప్రకారం, చంద్రుడు నెమ్మదిగా కుంచించుకుపోతున్నాడు.
లక్షలాది సంవత్సరాలుగా జరుగుతున్న మార్పుల కారణంగా చంద్రుడి వ్యాసం 160 అడుగుల మేర తగ్గిందని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. చంద్రుడు భూమి మీద సముద్ర అలలను నియంత్రిస్తాడు కాబట్టి, దాని నిర్మాణం లేదా కక్ష్యలో చిన్న మార్పులు జరిగినా.. సముద్ర అలల తీరు మారుతుంది. తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలు, వాతావరణ చక్రాలు కూడా ప్రభావితమవుతాయి.