RK Roja | ఒకసారి ఎమ్మెల్యే అయితే బీపీ, మళ్లీ ఎమ్మెల్యే అయితే షుగర్ వచ్చాయ్ : రోజా
RK Roja | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తను ఎదుర్కొన్న ఆరోగ్య సవాళ్లు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న వైసీపీ సర్పంచ్‌లను రోజా నగరిలోని తన నివాసంలో సన్మానించారు.
నగరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తను ఎదుర్కొన్న ఆరోగ్య సవాళ్లు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న వైసీపీ సర్పంచ్‌లను రోజా నగరిలోని తన నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అంటేనే మానసిక ఒత్తిడితో కూడుకున్నవని పేర్కొన్నారు.
తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బీపీ సమస్య వచ్చిందని, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత షుగర్ బారిన పడ్డానని ఆమె తన వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని గురించి రోజా వెల్లడించారు. గత వైసీపీ పాలనలో జగన్ నేతృత్వంలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని, ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరించడం తమ పార్టీ సంస్కృతి అని చెప్పారు.
ఎన్నికల సమయంలో కూటమి నేతల్లా తాము అబద్ధాలు చెప్పలేకపోయామని, అందుకే ఓటమి పాలయ్యామని రోజా అన్నారు. వైసీపీ సర్పంచ్‌లు గర్వంగా ప్రజల్లో తిరిగేలా పనులు చేశారని మెచ్చుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ పార్టీ సత్తా ఏంటో చాటాలని పిలుపునిచ్చారు. అబద్ధాలతో గెలిచిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

