BCCI : ఇటీవల కాలంలో మహిళల క్రికెట్ అభివృద్దికి పలు చర్యలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2025)ఛాంపియన్‌గా అవతరించిన టీమిండియా క్రికెటర్లకు ప్రోత్సాహకంగా మ్యాచ్ ఫీజులను పెంచనుంది. డిసెంబర్ 22 న జరుగనున్న సమావేశంలో మ్యాచ్ ఫీజుల సవరణ అంశం ప్రధానంగా చర్చకు రానుంది.
ఈమధ్యే స్వదేశంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. మహిళా క్రికెట్ చరిత్రలో తొలి ఐసీసీ ట్రోఫీతో దేశం గర్వపడేలా చేసింది హర్మన్కౌర్ బృందం. దాంతో.. దేశవాళీలో మహిళా క్రికెటర్లకు వేతనాలు పెంచాలనే నిర్ణయానికొచ్చింది బీసీసీఐ. ప్రస్తుతం డొమెస్టిక్ మ్యాచ్‌లకు చెల్లిస్తున్న మ్యాచ్ ఫీజుల సవరణపై డిసెంబర్ 22 న వర్చువల్‌గా జరిగే సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు చర్చించనున్నారు.
🚨 𝗕𝗥𝗘𝗔𝗞𝗜𝗡𝗚 𝗡𝗘𝗪𝗦 🚨
The BCCI will discuss pay for women cricketers at a meeting on December 22.
They aim to revise match fees in domestic tournaments.
“Disparities continue in domestic competitions.”
Central contracts for the men’s team will also be covered.… pic.twitter.com/1Wn4UK8lVe
— Gully Point (@gullypoint_) December 11, 2025
ఇదే మీటింగ్‌లో భారత పురుషుల జట్టు ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ (Central Contract) అంశం కూడా తెరపైకి రానుంది. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) గ్రేడ్ మారే అవకాశముంది. ప్రస్తుతం ఏ ప్లస్ విభాగంలో ఉన్న వీరిని ఏకు మారుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల జీతాల పెంపుపై కూడా బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. పురుషులతో పోల్చితో మహిళా క్రికెటర్లకు దేశవాళీ ఫీజులు తక్కువే ఉండే అవకాశముంది.
1. బీసీసీఐ సమావేశం 30వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడం.
2. మహిళా క్రికెటర్లకు దేశవాళీలో మ్యాచ్ ఫీజుల సవరణ.
3. బీసీసీఐ డిజిటల్ ఆస్తులు (వెబ్సైట్, డొమైన్స్, యాప్స్, సోషల్‌మీడియా ఖాతాలు) వంటివి అప్డేట్ చేయడం.
4. అంపైర్లు, రిఫరీల మ్యాచ్ ఫీజుల్లో సవరణ.
5. క్రికెటర్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ పునరుద్దరణ.
6. బీసీసీఐ అధ్యక్షుడు ఒకవేళ ఏదైనా అత్యవసరమైన విషయాన్ని ప్రస్తావిస్తే.. దాన్ని ఎజెండాలో చేర్చే అవకాశముంది.