టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రస్థానం ముగిసిపోయిన విషయం తెలిసిందే. నిన్న నమీబియాపై మ్యాచ్ గెలిచినా కూడా టీమిండియా టోర్నీ నుంచి వెనుదిరగాల్సివచ్చింది. అయితే.. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో భారత్‌కు అంతర్జాతీయ టీ20 సిరీస్ జరగనుంది. దాని కోసం టీమిండియా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇది హోమ్ టూర్. భారత్‌లోనే మ్యాచ్‌లు జరగనున్నాయి.
న్యూజిలాండ్ సిరీస్ కోసం బీసీసీఐ తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో.. జట్టు పగ్గాలను బీసీసీఐ రోహిత్ శర్మకు అందించింది. మొత్తం 16 సభ్యుల టీమ్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
హిట్లర్, ఓపెన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా న్యూజిలాండ్ సిరీస్‌కు వ్యవహరించనున్నారు. అయితే.. న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ కోహ్లీకి పూర్తిగా రెస్ట్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో కోహ్లీ ఆడటం లేదు. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో భారత్.. మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
టీమిండియా నుంచి సెలెక్ట్ అయిన 16 సభ్యుల జట్టు సభ్యులలో.. రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రెయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజువేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు.
NEWS – India’s squad for T20Is against New Zealand & India ‘A’ squad for South Africa tour announced.@ImRo45 named the T20I Captain for India.
— BCCI (@BCCI) November 9, 2021
More details here – https://t.co/lt1airxgZS #TeamIndia pic.twitter.com/nqJFWhkuSB