Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Bathukamma | బతుకమ్మ సంబురాల్లో భాగంగా జనగామ పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలంతా బతుకమ్మ పాటలు పాడుకొని, ఆటలు ఆడుకొని బతుకమ్మను నిమజ్జనం చేయడానికి రంగప్ప చెరువు వద్దకు వెళ్లారు.
Bathukamma | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో అంగరంగవైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు కాంగ్రెస్ సర్కార్ కనీస ఏర్పాట్లు చేయాలన్న ఆలోచన కూడా చేయలేదని తాజా వీడియో చెప్పకనే చెబుతోంది.
బతుకమ్మ సంబురాల్లో భాగంగా జనగామ పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలంతా బతుకమ్మ పాటలు పాడుకొని, ఆటలు ఆడుకొని బతుకమ్మను నిమజ్జనం చేయడానికి రంగప్ప చెరువు వద్దకు వెళ్లారు. అయితే ఆ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చుక్క నీరు కూడా లేదు. దీంతో చేసేదేమి లేక మహిళలు బతుకమ్మ ఎండిపోయిన చెరువులోనే నిమజ్జనం చేశారు.
చెరువులో కనీసం నీళ్లు లేకపోవడం, ప్రభుత్వం బతుకమ్మల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భూమిపైనే బతుకమ్మలను నిమజ్జనం చేసే పరిస్థితి రావడంపై మహిళలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నీళ్ళు లేక నేలపైనే బతుకమ్మను నిమజ్జనం చేసిన మహిళలు
జనగామ పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మను నిమజ్జనం చేయడానికి రంగప్ప చెరువు వద్దకు వెళ్లిన మహిళలు
అక్కడ నీళ్ళు లేకపోవడం, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భూమిపైనే బతుకమ్మలను నిమజ్జనం చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

