Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Maganur | నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం నెరడగం గ్రామంలో షార్ట్‌సర్క్యూట్ తో వెంకటరాములు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది .
మాగనూర్ : నారాయణపేట జిల్లా మాగనూర్ ( Maganur ) మండలం నెరడగం గ్రామంలో షార్ట్‌సర్క్యూట్ ( Short-circuit ) తో వెంకటరాములు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది ( House gutted ). ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలు, నగదు, బియ్యం, ఇంటి , వాహనాల కాగితాలు, నిత్యావసర సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బాధిత కుటుంబం సర్వం కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.
విషయం తెలుసుకున్న మఖ్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అగ్నిప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించి, కాలిపోయిన ఇంటి సామగ్రిని, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు వచ్చి విచారణ చేపట్టి ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో మాజీ ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి అగ్నిప్రమాద వివరాలను తెలియజేశారు.
బాధిత కుటుంబానికి జరిగిన నష్టాన్ని వివరించి, వారికి సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక పరిహారం అందించాలని, ఇంటి పునర్నిర్మాణానికి, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అవసరమైన సహాయాన్ని అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

