Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Violence In Manipur | బీజేపీ పాలిత మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కామ్జోంగ్, ఉఖ్రుల్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. అలాగే చస్సాద్‌లో 10 ఇళ్లు, 20 షాపులు దగ్ధమయ్యాయి.
ఇంఫాల్: బీజేపీ పాలిత మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కామ్జోంగ్, ఉఖ్రుల్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. అలాగే చస్సాద్‌లో 10 ఇళ్లు, 20 షాపులు దగ్ధమయ్యాయి. (Violence In Manipur) మణిపూర్‌లోని నాగా, కుకీ-జో తెగల మధ్య ఇటీవల మళ్లీ హింస చెలరేగింది. కామ్జోంగ్ జిల్లాలోని చస్సాద్ ప్రాంతంలో శనివారం ఉదయం సాయుధ వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 23 ఏళ్ల మైఖేల్ న్గామ్మిన్లెన్ హాకిప్ మరణించాడు. ఉఖ్రుల్ జిల్లాలోని టీఎం కసోమ్ సమీపంలోని యావోలెన్ వద్ద 40 ఏళ్ల సందీప్ రాయ్ వాహనంపై సాయుధులు కాల్పుల్లో జరుపగా చనిపోయాడు. చస్సాద్‌లో శుక్రవారం రాత్రి సుమారు 9:40 గంటలకు బుల్లెట్ గాయాలతో ఐదుగురు పిల్లల తల్లి, కుకీ తెగకు చెందిన డోమ్ఖోనీ టౌతాంగ్ హత్య జరిగిన కొద్ది రోజులకే ఈ రెండు మరణాలు సంభవించాయి.
కాగా, కామ్‌జాంగ్ జిల్లాలోని మణిపూర్-మయన్మార్ సరిహద్దులోని నింగ్చౌ గ్రామంలో శనివారం ఉదయం సాయుధులైన వ్యక్తులు ఇద్దరు నాగా గ్రామస్థులను తుపాకీతో కాల్చి చంపారు. మృతులను 35 ఏళ్ల న్గాచాన్సో నింగ్షెన్, 48 ఏళ్ల లీషిషన్ లీషాడాంగ్గా గుర్తించారు. దీంతో మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో నలుగురు కామ్‌జాంగ్ జిల్లాలో, ఒకరు పొరుగున ఉన్న ఉఖ్రుల్ జిల్లాలో మరణించారు.
మరోవైపు శనివారం ఉదయం చస్సాద్, పరిసర ప్రాంతాల్లో కనీసం 10 ఇళ్లు, 20 షాపులకు దుండగులు నిప్పు పెట్టారు. నష్టం తీవ్రత, నిరాశ్రయులైన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు. భద్రతా దళాలు ఆయా ప్రాంతాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ‘కమిటీ ఆన్ ట్రైబల్ యూనిటీ’ కాంగ్పోక్పి జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

