బతుకును ఇవ్వమ్మా!
ప్రకృతిలోని పూలను ఒక దగ్గర చేర్చి వరుస వరుసలుగా అందంగా పేర్చి
ప్రకృతిలోని పూలను ఒక దగ్గర చేర్చి
వరుస వరుసలుగా అందంగా పేర్చి
అమ్మలను గన్న అమ్మను మనసు నిండా తలచి
పువ్వొక్క తీరు బతుకమ్మ అని అందరూ కలిసి ఆడే
ఆడపిల్ల జన్మకు అందమైన అర్థాన్ని ఇవ్వమ్మా!
ప్రతి పువ్వునూ పేర్చి నిన్ను కొలిచేవేళ
ప్రతి ఆడబిడ్డ జీవితంలోనూ
వెలగాలి స్వేచ్ఛ అనే జ్యోతిమాల
వారి క్షేమ స్థయిర్యాలకు చేసేరమ్మా నీకు వేడుకోలు!
ఆమె కలలకు ఆకాశమే హద్దు అవ్వాలి
ఆమె ప్రతిభకు ప్రపంచమే వేదిక కావాలి
ఆమెకు రెక్కలిస్తే ఆకాశం అందుతుంది
అవకాశమిస్తే అద్భుతాలు సృష్టిస్తుంది!
ఆడా మగా తేడా లేని అందమైన రేపటిని ఇవ్వమ్మా!
చేతికి పుస్తకం ఇచ్చి చదువుకునే హక్కు
స్వయంగా తన చరిత్రను తనే రాసే శక్తి
ఎంచుకున్న రంగంలో ఎదిగే స్వేచ్ఛ ఎన్నుకున్న బాటలో నడిచే ధైర్యం!
బతికే హక్కుతో పాటు బతుకును ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వమ్మా!
బతుకమ్మ…బతుకమ్మ బతుకును ఇవ్వమ్మా!
డా.కే.రజనిప్రియ
8897786788
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

