విద్యావంతుల మౌనం సమాజానికి చేటు.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
చరిత్రలో ఏ గొప్ప విప్లవాత్మక మార్పు అయినా యువత భాగస్వామ్యంతోనే సాధ్యమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సోమాజిగూడలో పట్టభద్రుల సన్నాహక సమావేశం జరిగింది.
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : చరిత్రలో ఏ గొప్ప విప్లవాత్మక మార్పు అయినా యువత భాగస్వామ్యంతోనే సాధ్యమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సోమాజిగూడలో పట్టభద్రుల సన్నాహక సమావేశం జరిగింది. మాజీ కార్పొరేటర్ మహేశ్‌యాదవ్, బీఆర్ఎస్వీ నేత మధుకర్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు శ్రవణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మార్పు యువతతోనే సాధ్యమని పేరొన్నారు. ప్రస్తుత విద్యావంతులు, యువతలో రాజకీయాలు, ఓటింగ్‌పై ఉన్న నిర్లిప్తత సమాజానికి ఎంతో నష్టదాయకమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ వంటి కీలక నియోజకవర్గంలో కేవలం 8 వేల ఓట్లు మాత్రమే నమోదు కావడం విచారకరమని అన్నారు. చదువుకున్నవారు ఎన్నికల రోజును కేవలం ఒక సెలవుదినంగా భావిస్తే అనర్హులు అందలమెకుతారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

